సినిమా ఇండస్ట్రీలో ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను మరో భాషలో రీమేక్ చేయడం ఎప్పటి నుంచో కొనసాగుతున్న ట్రెండ్. ఇప్పటికే ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు రీమేక్ అయి ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు ఇదే లిస్ట్‌లోకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా కూడా చేరబోతుందనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
గత ఏడాది గుజరాతీ భాషలో విడుదలైన ‘లాలో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. కేవలం రూ.50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.120 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. దీంతో రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన తొలి గుజరాతీ సినిమాగా ‘లాలో’ రికార్డు సృష్టించింది.
ఇప్పుడు ఈ సూపర్ హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు రీమేక్ హక్కుల కోసం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అంతేకాదు.. ఈ రీమేక్‌లో రామ్ చరణ్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు కాకుండా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం జరుగుతోంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులు చేసి ఈ సినిమాను తెరకెక్కించేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అంతేకాదు.. ఈ సినిమాలో రామ్ చరణ్ శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించనున్నారనే వార్త మరింత ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ఈ రీమేక్ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సిందే.
ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
సుకుమార్ సినిమా పూర్తయిన తర్వాతే ‘లాలో’ తెలుగు రీమేక్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు రామ్ చరణ్ ఇటీవల బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
మొత్తానికి రూ.50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.120 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘లాలో’ను రామ్ చరణ్ రీమేక్ చేస్తారనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తిని రేపుతోంది. ముఖ్యంగా చరణ్ శ్రీకృష్ణుడి పాత్రలో కనిపిస్తారనే ప్రచారం నిజమైతే ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.









