Search
Close this search box.

  రజనీ స్టైల్.. రామ్ ఎనర్జీ.. అనిరుధ్ మ్యూజిక్.. ‘ధర్మన్’ మాస్ ర్యాంపేజ్..!

August 31, 2026 8:31 PM | Aditya369 News

రజనీ స్టైల్.. రామ్ ఎనర్జీ.. అనిరుధ్ మ్యూజిక్.. ‘ధర్మన్’ మాస్ ర్యాంపేజ్..!

సూపర్‌స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ధర్మన్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఓ మై కడవులే’ ఫేమ్ అశ్విత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు సమాచారం.

రజనీకాంత్, రామ్ పోతినేని ఒకే సినిమాలో కనిపించనుండటంతో ఈ కాంబినేషన్‌పై ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో భారీ ఆసక్తి ఏర్పడింది.

ఈ సినిమాలో రజనీకాంత్ సరికొత్తగా డాక్టర్ పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే రామ్ పోతినేని పాత్రే సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలవనుందని సమాచారం.

రజనీ పాత్రకు అల్లుడి వరుసలో ఉండే క్యారెక్టర్‌లో రామ్ కనిపించనున్నారని, ఈ పాత్రకు పవర్‌ఫుల్ నెగిటివ్ షేడ్స్ ఉంటాయని ప్రచారం జరుగుతోంది. సాధారణ విలన్‌గా కాకుండా, రజనీకాంత్ పాత్రకు గట్టి పోటీ ఇచ్చేలా రామ్ క్యారెక్టర్‌ను దర్శకుడు డిజైన్ చేశారని టాక్.

మామా-అల్లుళ్ల మధ్య జరిగే ఈగో క్లాష్ చుట్టూనే కథ ఆసక్తికరంగా సాగనుందని తెలుస్తోంది.

ఇప్పటివరకు రామ్ పోతినేనిని ఎనర్జిటిక్ మాస్ హీరోగా చూసిన ప్రేక్షకులు.. ఈ సినిమాలో ఆయనను పూర్తిగా భిన్నమైన షేడ్స్‌లో చూడబోతున్నారనే వార్త ఆసక్తిని మరింత పెంచుతోంది.

ముఖ్యంగా రజనీకాంత్, రామ్ పోతినేని మధ్య వచ్చే ఫేస్-ఆఫ్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. ఇద్దరి మధ్య మాస్ సీన్స్‌ను దర్శకుడు హై వోల్టేజ్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో రామ్ పోతినేని పాత్రకు సంబంధించి మూడు ప్రత్యేక ట్రాక్స్ ఉండనున్నాయని టాక్. అందులో రజనీకాంత్, రామ్ కలిసి చేసే హై-ఎనర్జీ మాస్ డాన్స్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సమాచారం.

రజనీ స్టైల్‌కు రామ్ ఎనర్జీ, దానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ తోడైతే థియేటర్లలో మాస్ ఆడియన్స్‌కు పండగే అని అభిమానులు భావిస్తున్నారు.

ఈ చిత్రంలో సీనియర్ నటి సిమ్రాన్‌తో పాటు రాశీ ఖన్నా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం.

మొత్తానికి రజనీకాంత్ లాంటి సూపర్‌స్టార్‌తో రామ్ పోతినేని తొలిసారి ఇలాంటి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారనే వార్తే సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తోంది.

రజనీ హీరోగా.. రామ్ విలన్ షేడ్స్‌లో కనిపిస్తే ఈ ఇద్దరి మధ్య పోరు ఎలా ఉంటుందో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజంగానే ఈ కాంబినేషన్ తెరపై వర్కౌట్ అయితే ‘ధర్మన్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ర్యాంపేజ్ క్రియేట్ చేస్తుందో చూడాలి!

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు