Search
Close this search box.

  హీరోగా లోకేష్ కనకరాజ్ సెన్సేషన్..! తొలి సినిమాతోనే రూ.100 కోట్ల రికార్డ్..!

August 21, 2026 9:13 PM | Aditya369 News

హీరోగా లోకేష్ కనకరాజ్ సెన్సేషన్..! తొలి సినిమాతోనే రూ.100 కోట్ల రికార్డ్..!

తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దర్శకుడిగా వరుస విజయాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న ఆయన.. తాజాగా హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. హీరోగా ఆయన నటించిన తొలి సినిమా ‘డిసి’ ప్రేక్షకులకు మంచి ట్రీట్‌గా నిలిచింది.

దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన తర్వాత నెమ్మదిగా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మొదట్లో పెద్దగా హడావుడి లేకపోయినా.. మౌత్ టాక్‌తో క్రమంగా ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచుకుంది. అలా స్లో పాయిజన్‌లా ప్రేక్షకులకు ఎక్కిన ఈ సినిమా.. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది.

తాజాగా ‘డిసి’ సినిమా ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో హీరోగా తన తొలి సినిమాతోనే రూ.100 కోట్ల గ్రాస్ సాధించిన అరుదైన ఘనతను లోకేష్ కనకరాజ్ సొంతం చేసుకున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

దర్శకుడిగా ఇప్పటికే తన మార్క్ చూపించిన లోకేష్.. ఇప్పుడు హీరోగా కూడా సత్తా చాటడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ముఖ్యంగా ఎలాంటి భారీ స్టార్ ఇమేజ్ లేకుండానే తన తొలి సినిమాతో ఈ స్థాయి వసూళ్లు సాధించడం విశేషంగా మారింది.

‘డిసి’ విజయానికి సంగీత దర్శకుడు అనిరుధ్ అందించిన మ్యూజిక్ కూడా కీలకంగా నిలిచిందని చెప్పొచ్చు. సినిమాలోని సన్నివేశాలకు అనుగుణంగా ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాలో సంజన, వామికా గబ్బి హీరోయిన్లుగా నటించగా.. సన్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించింది. మొత్తంగా దర్శకుడిగా ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేష్ కనకరాజ్.. హీరోగా కూడా తొలి అడుగులోనే రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ అందుకోవడంతో ఈ విజయం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు