Search
Close this search box.

  ‘టాక్సిక్’ సీన్లపై రచ్చ..! యశ్ స్ట్రాంగ్ రిప్లై..!

August 16, 2026 8:14 PM | Aditya369 News

‘టాక్సిక్’ సీన్లపై రచ్చ..! యశ్ స్ట్రాంగ్ రిప్లై..!

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, పాటల్లో కనిపించిన కొన్ని సన్నివేశాలపై విమర్శలు రావడంతో.. తాజాగా యశ్ వాటిపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

తాను అసభ్యతను ఎప్పటికీ ప్రోత్సహించనని యశ్ స్పష్టం చేశారు. అంతేకాదు, ‘టాక్సిక్’ సినిమాలో తాను కనీసం కిస్ సీన్‌లో కూడా నటించలేదని తెలిపారు. టీజర్ లేదా పాటల్లోని కొన్ని సన్నివేశాలను మాత్రమే చూసి సినిమాను అంచనా వేయడం సరికాదని ఆయన అన్నారు.

ప్రతి సన్నివేశం వెనుక ఒక సందర్భం, భావోద్వేగం ఉంటుందని.. సినిమా మొత్తాన్ని చూసినప్పుడు ఆ సన్నివేశాల ఉద్దేశం ప్రేక్షకులకు మరింత స్పష్టంగా అర్థమవుతుందని యశ్ పేర్కొన్నారు.

ఇక ‘టాక్సిక్’ కేవలం యాక్షన్, గ్లామర్‌తో నిండిన సినిమా కాదని యశ్ చెప్పుకొచ్చారు. జనరేషన్ గ్యాప్, పాత తరం ఆలోచనలు, నియమాలను నేటి తరం ప్రశ్నించే విధానం వంటి ఆసక్తికరమైన అంశాలను సినిమాలో చూపించబోతున్నట్లు వెల్లడించారు.

దీంతో ప్రస్తుతం ‘టాక్సిక్’పై ఉన్న విమర్శలకు యశ్ ఇచ్చిన వివరణ ఆసక్తికరంగా మారింది. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తాయనే అంచనాలు కూడా ఉన్నాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore