పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’. పవర్‌ఫుల్ కాప్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ సీన్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది
తాజాగా ఈ ఎంట్రీ సీన్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెంట్రల్ జైలులో ఈ సీక్వెన్స్ ప్రారంభమవుతుందని టాక్. జైలులో ఒక్కసారిగా అలజడి మొదలై, పరిస్థితులు అదుపు తప్పుతాయట. నేరస్థులు హద్దులు దాటడం, పోలీసులు పరిస్థితిని కంట్రోల్ చేయలేకపోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంటుందట.
అదే సమయంలో ఒక్కసారిగా ప్రభాస్ పాత్ర పేరు వినిపిస్తుందని.. ఆ పేరు వినగానే నేరస్థుల్లో భయం మొదలయ్యేలా సీన్‌ను డిజైన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత ఎలాంటి హడావుడి, యాక్షన్ లేకుండా ప్రభాస్ పోలీస్ లుక్‌లో హిందీ క్లాసికల్ సాంగ్స్ వింటూ చాలా కూల్‌గా ఎంట్రీ ఇస్తాడట.
ప్రభాస్ పాత్రలో ఎలాంటి కోపం, ఆగ్రహం లేదా అగ్రెషన్ కనిపించకపోయినా.. ఆయన పేరు వినగానే నేరస్థులు ఎందుకు భయపడుతున్నారు? అనే ప్రశ్న చుట్టూనే కథలో ఆసక్తికరమైన అంశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో త్రుప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
మొత్తానికి ‘స్పిరిట్’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా మరో డిఫరెంట్ అండ్ ఇంటెన్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.









