రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సంచాలకులు వారి ఆదేశాల మేరకు, వెనుకబడిన తరగతుల అధ్యయనకేంద్రం రాజమహేంద్రవరం నందు మెగా డీఎస్ ఈ (MEGA DSC) పరీక్షకు హాజరగు అభ్యర్థులకు తూర్పు గోదావరి జిల్లాలోని బి.సి స్టడీ సర్కిల్ నందు జూలై 1వ తేదీ నుండి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించబడునని జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి పిల్లి సత్య రమేష్ తెలియజేశారు.
శిక్షణ తరగతుల తో పాటు ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన ప్రాక్టీసు టెస్ట్లు మరియు గ్రాండ్ టెస్ట్లు కూడా నిర్వహించబడునని, లైబ్రరీ సౌకర్యం కూడా ఉందని తెలియజేశారు. రెండు నెలల శిక్షణ కాలంలో అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ 1,000/-, నెలకు స్టయిఫండ్ 1,500/- మరియు బుక్స్ వెలవెన్సెస్ లాంటి సౌకర్యములు కలవని పేర్కొన్నారు. కావున ఆసక్తి మరియు అర్హత గల ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీకి (SC, ST, BC& minority) సంబంధించిన అభ్యర్థులు Mega DSC – 2024 పోటీ పరీక్షకు సిద్ధపడుతున్న అభ్యర్థులు పదవ తరగతి, ఇంటర్, ఎస్ జి టి టెట్ క్వాలిఫైడ్, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, సెల్ఫ్ అడ్రస్ కవర్, సర్టిఫికెట్స్ జిరాక్స్ ప్రతులను దరఖాస్తుకు జత చేసి జూన్ 30వ తేదీ లోగా ఈ దిగువ తెలిపిన చిరునామాకు పంపాలన్నారు.
డైరెక్టర్, ఏపీ బీసీ స్టడీ సర్కిల్, నియర్ ఆర్ట్స్ కాలేజ్, రాజమహేంద్రవరం-533133 తూర్పుగోదావరి జిల్లా.. వారికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. బి.సి స్టడీ సర్కిల్ నందు ఉచిత శిక్షణ పొందగోరు అభ్యర్థులు మరిన్ని ఇతర వివరములు కొరకు ఈ క్రింది ఫోన్ నెంబర్లును 0883 2421129, 9393934825, 8639447339 సంప్రదించవచ్చునని అధికారులు వెల్లడించారు.