Search
Close this search box.

  ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత.. 74 ఏళ్ల వయసులో తుదిశ్వాస

August 4, 2026 11:28 PM | Aditya369 News

ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత.. 74 ఏళ్ల వయసులో తుదిశ్వాస

ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. 74 ఏళ్ల ప్రదీప్ రావత్ కొంతకాలంగా రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. మంగళవారం ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘సై’ సినిమాతో ప్రదీప్ రావత్ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఈ చిత్రంలో భిక్షు యాదవ్ పాత్రలో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రతినాయకుడిగా ఆయన చూపించిన నటనా ప్రతిభకు మంచి గుర్తింపు లభించింది.

‘సై’ సినిమాలోని భిక్షు యాదవ్ పాత్రకు గాను ప్రదీప్ రావత్ ఉత్తమ ప్రతినాయకుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. తెలుగు సహా పలు భాషల్లో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటుగా మారింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు