Search
Close this search box.

  మారుతికి మెగా హీరో దొరికేశాడు..! వరుణ్ తేజ్‌తో క్రేజీ కాంబో..?

July 21, 2026 10:39 PM | Aditya369 News

మారుతికి మెగా హీరో దొరికేశాడు..! వరుణ్ తేజ్‌తో క్రేజీ కాంబో..?

'ది రాజా సాబ్' విడుదల తర్వాత దర్శకుడు మారుతి కొంతకాలం మీడియాకు దూరంగా ఉన్నారు. ఇటీవల ఓ సినీ కార్యక్రమంలో కనిపించిన ఆయన, తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 'ది రాజా సాబ్' ఫలితం తర్వాత సోషల్ మీడియాలో మారుతిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవగా, ఇప్పుడు ఆయన నెక్స్ట్ మూవీపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా కొత్త స్క్రిప్ట్ సిద్ధమైందని మారుతి స్వయంగా వెల్లడించారు. అప్పటి నుంచి ఆయన తదుపరి హీరో ఎవరు అనే అంశం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

తాజా ప్రచారం ప్రకారం, మారుతి తన కొత్త కథను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు వినిపించగా, కథ నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

ప్రస్తుతం వరుణ్ తేజ్ వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న 'కొరియన్ కనకరాజు' విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు తన సోదరి నిహారిక కొణిదెల నిర్మాణంలో రూపొందుతున్న మరో చిత్రంలో కూడా నటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మారుతి–వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుందనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ నిజంగానే పట్టాలెక్కుతుందా? ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

‘ది రాజా సాబ్’ విడుదల తర్వాత దర్శకుడు మారుతి కొంతకాలం మీడియాకు దూరంగా ఉన్నారు. ఇటీవల ఓ సినీ కార్యక్రమంలో కనిపించిన ఆయన, తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ‘ది రాజా సాబ్’ ఫలితం తర్వాత సోషల్ మీడియాలో మారుతిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవగా, ఇప్పుడు ఆయన నెక్స్ట్ మూవీపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా కొత్త స్క్రిప్ట్ సిద్ధమైందని మారుతి స్వయంగా వెల్లడించారు. అప్పటి నుంచి ఆయన తదుపరి హీరో ఎవరు అనే అంశం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

తాజా ప్రచారం ప్రకారం, మారుతి తన కొత్త కథను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు వినిపించగా, కథ నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

ప్రస్తుతం వరుణ్ తేజ్ వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న ‘కొరియన్ కనకరాజు’ విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు తన సోదరి నిహారిక కొణిదెల నిర్మాణంలో రూపొందుతున్న మరో చిత్రంలో కూడా నటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మారుతి–వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుందనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ నిజంగానే పట్టాలెక్కుతుందా? ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు