న్యాచురల్ స్టార్ నాని అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా మరోసారి వాయిదా పడిందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ డేట్ మారిన ఈ చిత్రం.. ఇప్పుడు మూడోసారి కూడా పోస్ట్‌పోన్ అవుతుందనే టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో అసలు ఈ వాయిదా వెనుక కారణం ఏమిటి? కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు? అనే చర్చ జోరుగా సాగుతోంది.
‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో ‘ది ప్యారడైజ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 1940 నుంచి 1970 కాలం నాటి నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ మాఫియా డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారీ స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమా విజువల్స్, కథ, మేకింగ్‌పై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది.
మొదట ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేయాలని భావించిన మేకర్స్.. ఆ తర్వాత ఆగస్టు రిలీజ్‌కు ప్లాన్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఆగస్టు 21న విడుదల కావాల్సిన ‘ది ప్యారడైజ్’ ఇప్పుడు సెప్టెంబర్ 24కు వాయిదా పడినట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.
ఇక ఈ నిర్ణయం వెనుక కారణం కూడా ఆసక్తికరంగానే ఉంది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో ఇంకా సుమారు 30 రోజుల పని మిగిలి ఉండటంతో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడానికి మరింత సమయం అవసరమైందని సమాచారం. అంతేకాదు, ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమాకు సరైన ప్రమోషన్ ప్లాన్ చేయాలంటే కూడా అదనపు సమయం కావడంతో మేకర్స్ రిలీజ్‌ను వాయిదా వేసినట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 24ను కొత్త రిలీజ్ డేట్‌గా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక ఈ చిత్రంలో నాని సరసన కాయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. తనికెళ్ల భరణి, మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు, ఈశ్వరీ రావు, సోనాలి కులకర్ణి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, ప్రచార వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.
మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ నాని కెరీర్‌లో మరో మైలురాయి అవుతుందా? లేక విడుదల తేదీపై వస్తున్న ఈ వార్తలు కేవలం రూమర్స్‌గా మిగిలిపోతాయా? అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.









