ఎన్టీఆర్, ప్రభాస్, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు మెహర్ రమేష్… ఇప్పుడు మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. అయితే ఈసారి దర్శకుడిగా కాదు, నటుడిగా.
‘భోళా శంకర్’ విడుదల తర్వాత డైరెక్టర్‌గా కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న మెహర్ రమేష్… తాజాగా ఓ క్రేజీ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయనకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం.
మెహర్ రమేష్‌కు నటన కొత్తేమీ కాదు. గతంలో మహేష్ బాబు నటించిన ‘బాబీ’ చిత్రంలో ఆయన చిన్న పాత్రలో కనిపించారు. అయితే చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రావడం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇది కేవలం ప్రత్యేక పాత్ర కోసమేనా? లేక నటుడిగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాలనే ఆలోచనతో అడుగులు వేస్తున్నారా? అనే చర్చలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
అయితే యాక్టింగ్‌పై దృష్టి పెట్టారని చెప్పి… మెహర్ రమేష్ దర్శకత్వానికి పూర్తిగా గుడ్‌బై చెప్పేశారని మాత్రం కాదు. దర్శకుడిగానూ ఆయన ఓ కొత్త కథను సిద్ధం చేసుకుని, స్టార్ హీరోలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అంటే ఒకవైపు దర్శకుడిగా తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తూనే… మరోవైపు నటుడిగా కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారన్నమాట.
మరి మెహర్ రమేష్ నటుడిగా ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటారో… అలాగే దర్శకుడిగా ఆయన కంబ్యాక్ ఎలా ఉండబోతుందో చూడాలి.









