‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘స్పిరిట్’, ‘సలార్-2’, ‘ఫౌజీ’, ‘కల్కి-2’ వంటి భారీ ప్రాజెక్టులతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న డార్లింగ్ ఖాతాలో మరో క్రేజీ మూవీ చేరబోతుందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు ఆదిత్య ధర్‌తో ప్రభాస్ ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వార్త బయటకు రావడంతో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో #Prabhas, #AdityaDhar హ్యాష్‌ట్యాగ్‌లతో సందడి చేస్తున్నారు.
ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం, ప్రభాస్ కోసం ఆదిత్య ధర్ ఓ పవర్ఫుల్ యాక్షన్ కథను సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కథపై చర్చలు జరిగాయని, ప్రభాస్ కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపించారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
అయితే ఈ ప్రాజెక్ట్ నిజమైతే, ప్రభాస్ కెరీర్లో మరో భారీ స్థాయి చిత్రంగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఆదిత్య ధర్ తన ప్రత్యేకమైన టేకింగ్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు ప్రభాస్ మాస్ ఇమేజ్ కలిస్తే సినిమా స్థాయి మరింత పెరుగుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పటికే ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్ వంటి స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్న ప్రభాస్ లైనప్‌లో ఆదిత్య ధర్ పేరు వినిపించడం ఆసక్తిని పెంచుతోంది.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌పై ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందా? లేక ఇది కేవలం ప్రచారంగానే మిగిలిపోతుందా? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.









