Search
Close this search box.

  2027 సమ్మర్…! టాలీవుడ్‌లో భారీ క్లాష్..?

May 6, 2026 12:36 PM | Aditya369 News

2027 సమ్మర్…! టాలీవుడ్‌లో భారీ క్లాష్..?

ఏ సీజన్ ఎలా ఉన్నా… సమ్మర్ అంటే టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పండగలాంటిది. కానీ ఈసారి ఆ జోష్ మాత్రం కనిపించలేదు. పెద్ద స్టార్లు తమ సినిమాలతో రాకపోవడంతో థియేటర్ల దగ్గర సందడి తగ్గిపోయింది. జూన్ 4న రామ్ చరణ్  ‘పెద్ది’తో సమ్మర్‌ను ముగించబోతున్నాడు. అయితే ఈ ఏడాది మిస్సైన ఎంటర్‌టైన్‌మెంట్‌ను వచ్చే ఏడాది (2027) డబుల్‌గా ఇస్తామని టాప్ స్టార్లు లైన్లో నిలిచారు.

ప్రభాస్‌తో సమ్మర్ వార్ స్టార్ట్

వచ్చే సమ్మర్ బిగ్ ఫైట్‌ను మొదలుపెట్టేది ప్రభాస్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ మార్చి 5, 2027న రిలీజ్ కానుంది. ఇందులో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. వంగా స్టైల్ యాక్షన్, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఖాయం అనిపిస్తోంది.

మహేశ్ బాబు గ్లోబల్ షో

‘స్పిరిట్’ హంగామా తగ్గకముందే, S. S. రాజమౌళి తన భారీ ప్రాజెక్ట్‌ను రంగంలోకి దించనున్నాడు. మహేశ్ బాబు  హీరోగా నటిస్తున్న ‘వారణాసి’ ఏప్రిల్ 7న విడుదల కానుంది. గ్లోబల్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ స్థాయి విజువల్స్, మహేశ్ మేకోవర్—ఇవి కలిస్తే ఇండియన్ బాక్సాఫీస్ కొత్త రికార్డులు చూడటం ఖాయం అంటున్నారు ట్రేడ్ వర్గాలు.

ఎన్టీఆర్ – నీల్ మాస్ ఫీస్ట్

సమ్మర్ ఎండ్‌కు అసలైన మాస్ బ్లాస్ట్ ఇవ్వడానికి ఎన్టీఆర్  రేడీ అవుతున్నాడు. ప్రశాంత్ నీల్  దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ జూన్ 11న రిలీజ్ కానుంది. నీల్ ఎలివేషన్స్, తారక్ ఎనర్జీ కలిస్తే థియేటర్లలో ఏ రేంజ్ హంగామా ఉంటుందో ఊహించుకోవచ్చు. మొత్తం మీద సమ్మర్‌ను ప్రభాస్ స్టార్ట్ చేస్తే, ఎన్టీఆర్ గ్రాండ్‌గా క్లోజ్ చేయబోతున్నాడు.

మే స్లాట్‌లో సీనియర్స్ ఎంట్రీ?

మార్చి, ఏప్రిల్, జూన్ స్లాట్లు ఇప్పటికే లాక్ అయ్యాయి. ఇక మేలో ఎవరు వస్తారు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. వినిపిస్తున్న సమాచారం ప్రకారం చిరంజీవి – బాబీ కాంబో సినిమా, అలాగే బాలకృష్ణ – కొరటాల శివ ప్రాజెక్ట్ సంక్రాంతి రేస్‌లో ఉన్నాయి. ఒకవేళ ఆ రిలీజ్ మిస్ అయితే, ఈ సినిమాలు సమ్మర్ మే స్లాట్‌ను టార్గెట్ చేసే అవకాశం ఉంది. అలా జరిగితే సీనియర్ స్టార్స్ ఎంట్రీతో సమ్మర్ మరింత హీట్ అవుతుంది.

రికార్డుల వేటకు రెడీ

ఒకే సమ్మర్‌లో ప్రభాస్, మహేశ్ బాబు, ఎన్టీఆర్ లాంటి పాన్ ఇండియా స్టార్లు బరిలో దిగడం చాలా అరుదు. దాదాపు 3000 కోట్ల మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్న ఈ సినిమాలు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.

మొత్తానికి… 2027 సమ్మర్ టాలీవుడ్‌కు గోల్డెన్ సీజన్ అవుతుందా? లేక అంచనాల బరువు సినిమాలపై ప్రభావం చూపుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది!

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore