గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండో సింగిల్ ‘రై రై రా రా’ మార్చి 2న విడుదలైంది. ఇప్పటికే వచ్చిన మొదటి పాట ‘చికిరి’ సూపర్ హిట్ కాగా, ఇప్పుడు రిలీజ్ అయిన ఈ మాస్ నంబర్ కూడా చార్ట్ బస్టర్ దిశగా దూసుకెళ్తోంది.
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ఈ పాటకు అనంతశ్రీరామ్ ఆకట్టుకునే సాహిత్యం అందించారు. ప్రత్యేకంగా ఈ సాంగ్‌ను రెహమాన్ స్వయంగా ఆలపించడం మరింత హైలైట్ అయింది. పక్కా మాస్ బీట్, హీరో ఎలివేషన్, గ్రామీణ బ్యాక్‌డ్రాప్—ఈ మూడు కలిసిన ఈ గీతంలో ఫోక్ పెర్కషన్ పవర్‌ఫుల్‌గా వినిపిస్తోంది. ముఖ్యంగా ‘రై రై రా రా’ అనే హుక్ లైన్ ఒక్కసారి వినగానే గుర్తుండిపోయేలా ఉంది. థియేటర్లలో ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొంత షూటింగ్ మిగిలి ఉన్నప్పటికీ, ముందుగా ప్రకటించినట్లుగానే ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
‘చికిరి’ తర్వాత వచ్చిన ఈ పవర్ఫుల్ మాస్ ట్రాక్ మెగా ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపింది.









