పట్టణంలోని స్థానిక లిటిల్ సోల్జర్స్ హైస్కూల్లో ఈనెల 28న జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి పి. లక్ష్మణరావు తెలిపారు.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 10,13,15 వయసు ఇండియన్ రౌండ్ బాల బాలికల విభాగాలలో పోటీలు జరుగుతాయన్నారు.ఈ పోటీల్లో పాల్గొనే ప్రతి ఆర్చర్ ఆధార్ కార్డు,జనన ధ్రువీకరణ పత్రం,జిరాక్స్ వెంట తీసుకురావాలన్నారు.మరిన్ని వివరాలకు 9989001162 సంప్రదించాలని ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారిని రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక అవుతారన్నారు.








