Search
Close this search box.

  క‌వ‌ల జంట‌లు..ఒక్క‌టైన‌ వేళ

February 24, 2026 10:08 PM | Aditya369 News

క‌వ‌ల జంట‌లు..ఒక్క‌టైన‌ వేళ

సాధార‌ణంగా అక్కా చెల్లెళ్ళు అన్న‌ద‌మ్ములు చేసుకోవ‌డం అరుదుగా జ‌రుగుతుంటుంది. అలాంటిది క‌వ‌లల‌ను క‌వ‌ల‌లే వివాహమాడ‌టం తెలంగాణాలో జ‌రిగింది. కామారెడ్డి జిల్లా కేంద్ర శివారు లింగాపూర్ ఈ క‌ల‌వల జంట క‌ల‌యిక‌కు వేదిక‌గా నిలిచింది.కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌కు చెందిన దుంపటి విజయ్‌కుమార్,వినయ్‌కుమార్‌ ఇద్దరు కవలలు. వీరికి ఇదే జిల్లా తాడ్వాయి మండలం దేమీ కలాన్‌ గ్రామానికి చెందిన కవలలు కుమ్మరి కీర్తన, కీర్తితో పెద్దలు వివాహం నిశ్చయించారు. రెండు జంటలు బంధుమిత్రుల సమక్షంలో, వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యాయి. నవదంపతులు విజయ్‌కుమార్‌-కీర్తన, వినయ్‌కుమార్‌-కీర్తి అందరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు