సుధీర్ఘకాలంగా పిఠాపురం పట్టణంలో పారిశుద్ధ్య కార్మికుల సమస్యకు పవన్ చెక్ పెట్టారు. 40 మంది పారిశుద్ధ్య కార్మికులను ఏజెన్సీ ద్వారా నియమించుకునేందుకు మున్సిపల్ శాఖ అనుమతినిచ్చింది. గత 5 ఏళ్లు కాలంగా ఎంత మొత్తకున్నా, పారిశుద్ధ్య కార్మికుల నియామకంపై ఎవ్వరూ పట్టించుకోలేదు. గత ఏడాది కాలంగా ఇదే సమస్యను తరచూ కౌన్సిల్ సమావేశాల్లో కూడా చర్చిస్తూ వచ్చారు. అయినప్పటికీ ఫలితం లేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించిన సమయంలో పారిశుద్ధ్య కార్మికుల కేటాయింపు సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కార్మికులను నియమించుకునే అంశంపై కౌన్సిల్ అభిప్రాయాన్ని అధికారులు తీర్మానపూర్వకంగా తీసుకున్నారు. ఇది జరిగి నెల రోజులు కాక ముందే 40 మంది పారిశుద్ధ్య కార్మికులను కేటాయించడంపై పవన్ కు పిఠాపురం పట్టణ వాసులు, కౌన్సిల్ సభ్యులు కృతజ్ఞతలు చెబుతున్నారు.








