కేంద్రం తీసుకొచ్చిన ‘వాహన్’ పోర్టల్లో మార్చి 15న చేరేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల అనుమతులు ఈ పోర్టల్లో పొందవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలు కొన్నా,అమ్మినా ఇక నుంచి ఓనర్ పేరు,అడ్రస్ మార్పులకు కార్యాలయాల చుట్టూ తిరగవలసిన పనిలేకుండా ఆన్లైన్లోనే
మార్చుకోవచ్చు. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ హిస్టరీ, డూప్లికేట్ ఆర్ సి వంటివి ఇందులో పొందే అవకాశం ఉంటుంది.









