నేషనల్ క్రష్ రష్మిక మందన్న, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కాక్టెయిల్ 2’ చిత్రంపై సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తోంది. షాహిద్ కపూర్ హీరోగా, హోమీ అదజానియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వీరిద్దరూ స్వలింగ ప్రేమికులుగా (LGBTQ+ నేపథ్యం) కనిపించనున్నట్లు సమాచారం. ఈ ప్రయోగాత్మక పాత్రలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని, ఇదొక విభిన్నమైన ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని బాలీవుడ్ మీడియాలో చర్చ జరుగుతోంది.
2012లో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె నటించిన సూపర్ హిట్ ‘కాక్టెయిల్’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా రాబోతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మొదటి భాగం ముగ్గురు స్నేహితుల మధ్య సాగే ప్రేమకథగా అలరించగా, రెండో భాగంలో రష్మిక-కృతి పాత్రల మధ్య కెమిస్ట్రీ సరికొత్త అనుభూతిని ఇస్తుందని భావిస్తున్నారు. ఈ పాత్రల ద్వారా రష్మిక బాలీవుడ్లో మరో పెద్ద బ్రేక్ అందుకోవడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో షాహిద్ కపూర్ మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో కనిపిస్తారని దర్శకుడు వెల్లడించారు. జనవరి 31తోనే షూటింగ్ పూర్తి కావడంతో, త్వరలోనే విడుదల తేదీని ప్రకటించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. అధికారికంగా ఈ పాత్రల స్వభావంపై క్లారిటీ రాకపోయినప్పటికీ, ఈ తాజా అప్డేట్ మాత్రం సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తోంది. విభిన్న పాత్రలతో తన ప్రతిభను నిరూపించుకుంటున్న రష్మికకు ఇది మరో పెద్ద సవాల్‌గా మారనుంది.








