ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో కాకినాడ సిటీ,రూరల్ పరిధిలో డ్రైనేజీల కబ్జాలు,అక్రమ నిర్మాణాలపై రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రస్తావించినట్టు ఎమ్మెల్యే కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. వాకలపూడి,వలసపాకల, రమణయ్యపేట,తిమ్మాపురం గ్రామాలు, అదేవిదంగా గోడారిగుంట, పల్లంరాజు నగర్ ప్రాంతాలు వరద ముంపుకు గురవుతున్నాయన్నారు.ప్రస్తుతం కాకినాడ రూరల్ ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్నాయ ని అవుట్‌లెట్ లేకపోవడంతో వాకలపూడి,వలసపాకల,రమణయ్యపేట, గుడారిగుంట ప్రాంతాల్లో స్వల్ప వర్షానికే నీరు నిలిచిపోతున్నదన్నారు.4.4 కిలోమీటర్ల పొడవున్న కాలువ అనేక చోట్ల కబ్జాకు గురైందని, 2009లో అప్పటి ఎమ్మెల్యే నిర్మాణం చేపట్టిన భవనానికి అధికారులు నిబంధనలు వర్తించవని సర్టిఫికెట్ ఇచ్చారని ఆరోపించారు.రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ శాఖలు కలిసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ముఖ్యమంత్రి రోశయ్య హయాంలో ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక కూడా కలెక్టరేట్‌లో కనబడటం లేదని పేర్కొన్నారు. ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు.









