కరప విఆర్వోల రాష్ట్ర సంఘం పిలుపుమేరకు సోమవారం తహశీల్దార్ కార్యాలయాల వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు.జిఎబ్ల్యూఎస్ అధికారులతో సరైన సమన్వయం లేకపోవడం, స్పష్టమైన జాబ్ చార్ట్ లేకపోవడం,తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక ఒత్తిడి కారణంగా కొందరు వీఆర్వోలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని,వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.మృతుల కుటుంబాలకు సంఘీభావంతెలిపి అండగా నిలుస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మండల వీఆర్వో సంఘం అధ్యక్షుడు దడాల భరణి కుమార్తో,ఎం సత్యకిషోర్,శ్రీను,ఏసేబు,వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.









