ఈనెల22న విజయవాడ వద్ద బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామ చంద్ర యాదవ్ తలపెట్టిన బీసీ సింహ గర్జనను విజయవంతం చేయాలని పిఠాపురం నియోజకవర్గ బీసీవై కన్వీనర్ శీరం శ్రీను పిలుపునిచ్చారు. మహాశివరాత్రి పురస్కరించుకుని బీసీవై పార్టీ కార్యకర్తలు పిఠాపురంలో మజ్జిగ పంపిణీ చేశారు. బీసీ సింహ గర్జన పాంప్లెట్లను కూడా పంచారు. కార్యక్రమంలో పీతల రాజా, మొరుకుర్తి శివ, బత్తుల రాజు, అప్పికొండ బాబి, గొర్లకొండ బాబు, కుండల శ్రీ రాఘవ, సందక సత్తిబాబు పాల్గొన్నారు









