మహాశివరాత్రి మహా పర్వదినం పురస్క రించుకొని కాకినాడ జిల్లా సామర్లకోటలో పంచారామ క్షేత్రం శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామి వారికి తెల్లవారుజాము నుండి పూజా కార్య క్రమాలు ప్రారంభమయ్యాయి. డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి స్వామివారి అభిషేక కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. శివనామ స్మర ణలతో ఆలయం మార్మోగింది. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. చుట్టు పక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు.









