కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం ఎమ్మెల్యే గా ఉన్న పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న చొరవతో రోడ్లకు మహార్ధశ పట్టిందని జనసేన కందరాడ నాయకులు అన్నారు. ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సహకారం కూడా మరవులేనిదన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద వచ్చిన రూ.64 లక్షల నిధులతో తలపెట్టిన రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపనలు చేశారు.ఉపముఖ్యమంత్రికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.








