కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాల్టీలో శానిటరీ సెక్రటరీలకు ఛార్జి మెమోలు ఇచ్చేందుకు వెనుకాడ బోమని మున్సిపల్ ఆర్డీ నాగనరసింహారావు హెచ్చరించారు. పిఠాపురం పట్టణంలో పలు ప్రాంతాలను కమిషనర్ కనకారావుతో కలిసి పరిశీలించారు. పారిశుద్ధ్యం నిర్వాహణ అస్సలు బాగోలేదన్నారు. మెరుగు పరచకపోతే ఛార్జి మెమోలు ఇస్తామన్నారు. త్వరలో పారిశుద్ధ్య సిబ్బందిని నియమిస్తామని ఆర్డీ స్పష్టం చేశారు.








