కాకినాడ జిల్లా పరిధిలో ఉన్న పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, తుని మున్సిపాల్టీల కమిషనర్లు, రెవిన్యూ అధికారులతోపాటు, గొల్లప్రోలు, ఏలేశ్వరం నగరపంచాయతీల అధికారులతో ఆర్డీ నాగనరసింహారావు సమీక్ష నిర్వహించారు. పన్నులు వసూలులో తుని మున్సిపాలిటీ 63% వసూలు చేసినట్లు ఆర్డీ తెలిపారు. పిఠాపురం మున్సి పాలిటీ 50 శాతం వసూళ్ళు చేసిన మున్సిపాల్టీ జాబితాలో చేరిందన్నారు. వాటర్ టాక్స్ అన్ని మున్సిపాలిటీల్లో వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నట్లు వెల్లడించారు.








