ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు,ప్రైవేట్ కాలేజ్‌లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.నిధుల విడుదలలో జాప్యంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.అయితే ఈ క్రమంలోనే విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీపి కబురు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న బకాయిల కోసం దాదాపు రూ.1,198 కోట్లు విడుదల చేశారు.ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది









