శంఖవరం మండలంలోని సిద్ధివారిపాలెంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉన్న ఆంధ్ర శబరిమలై ఆధ్యాత్మికత కేంద్రంలో ఆరడుగుల అరుణచలేశ్వరుడు విగ్రహ ప్రతిష్ట చేసినట్లు క్షేత్రం చైర్మన్ కుసుమంచి శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 15 వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ అరుణాచలేశ్వరుని విగ్రహం చుట్టూ జ్ఞానపీఠాలు కూడా ఏర్పాటు చేశామన్నారు.









