డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమస్యలపై స్పందిస్తున్న తీరు పేద హృదయాలను గెలుచుకుంటుంది. తాజాగా ఆయన కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మాధవపురం గ్రామంలో తల్లిదండ్రులు లేని ఇద్దరు పిల్లలకు ఆసరాగా నిలిచారు పవన్ కళ్యాణ్. మాధవపురం గ్రామానికి చెందిన కరణం జ్యోతి, నాగవెంకట దుర్గారావు అనే దంపతులు చనిపోయారు. వారి ఇద్దరు పిల్లలు అనాథులుగా మారడం, చదువుకోవడానికి కూడా అవకాశం లేదని ఆదుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరారు. ఈ విషయాన్ని జనసేన నాయకులు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన పవన్, నెలకు రూ.5 వేలు చొప్పన చిన్నారులకు అందివ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే వారికి ఇండ్ల స్థలం ఇవ్వాలని, చదువుకు ఆటంకం లేకుండా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.








