కాకినాడ జిల్లా పిఠాపురంలో బైపాసు రోడ్డులో సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న బస్ షెల్టర్ వద్ద పిఠాపురం మండలం రాపర్తికి చెందిన బొబ్బిలి కృష్ణ(40) మృతి చెందాడు. ఈయనకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. గొల్లప్రోలుకు చెందిన కృష్ణ, రాపర్తిలోనే జీవిస్తున్నాడు. అయితే కొంత కాలం నుండి బయట ప్రాంతాలలోనే తిరుగుతున్నాడని గ్రామస్తులు తెలిపారు. అనూహ్యంగా బస్‌షెల్టర్ వద్ద మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి, కుటుంబ సభ్యులకు సమచారం ఇచ్చారు. బంధువులు మృతదేహాన్ని తీసుకెళ్లారు.








