కాకినాడ జిల్లా ప్రముఖ శైవక్షేత్రాలైన పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి, సామర్లకోట భీమేశ్వరస్వామి ఆలయాలతోపాటు శైవ క్షేత్రాలలో ఎక్కడా ఎటువంటి ప్రత్యేక దర్శనాల పాసులు జారీ చేయడం లేదని కలెక్టర్ వెల్లడించారు. పాసులనే ప్రస్తావన తీసుకురావద్దన్నారు.ఆలయాల వద్ద విద్యుత్ సరఫరా అంతరాయం ఉండదని, పాదగయ పుష్కరిణి వద్ద ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది ఉంటారన్నారు.









