Search
Close this search box.

  కాకినాడ కలెక్టరేట్ ను ముట్టడించిన విద్యార్థులు

February 10, 2026 3:24 PM | Aditya369 News

కాకినాడ కలెక్టరేట్ ను ముట్టడించిన విద్యార్థులు

పెండింగ్ లో ఉన్న రూ7వేల కోట్ల ఫీజ్ రియింబర్స్మెంట్ బకాయిలు విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ) ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సి.హెచ్ లోవరాజు, ఎం.గంగా సూరిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మరిచిందన్నారు.బకాయి డబ్బులు విడుదల చేయకపోవడంతో కళాశాలల యాజమా న్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయని, పరీక్షలకు అనుమతించబోమని విద్యార్థులను బెదిరించి భయబ్రాంతులకు గురిచేస్తు న్నాయని ఆరోపించారు. రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాలలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై చర్చించి విద్యార్థు లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏ కళాశాల కూడా విద్యార్థుల హాలు టికెట్లు, సర్టిఫికెట్లు అంపకుండా చూస్తాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ జిల్లా, నగర నాయకులు సంజయ్, సాహిత్, జైరామ్, అమృత, నాని, సత్యం, రాజు, గమినివేలు, ఆదర్శ, విద్యార్థులు పాల్గొన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore