Search
Close this search box.

  అత్తపై అల్లుడు అత్యాచారం..ఆపై హత్య

February 10, 2026 12:10 PM | Aditya369 News

అత్తపై అల్లుడు అత్యాచారం..ఆపై హత్య

ఇల్లరికం తెచ్చుకున్న అల్లుడే అత్తపై అత్యాచారం చేసి హత్య చేసిన దారుణ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో జరిగింది.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.కల్వకుర్తి సీఐ నాగార్జున తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామానికి చెందిన ఓ మహిళ తన కుమార్తెకు కొన్నేళ్ల క్రితం తిమ్మాజీపేట మండలానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిపించింది.అల్లుడు మద్యానికి బానిసై తరచూ కుమార్తెను వేధింపులకు గురిచేస్తుండటంతో..అతడిని అత్త ఇంటికి ఇల్లరికం తెచ్చుకుంది.అయితే, ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో భార్య తన బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో అల్లుడు అత్తపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం తీవ్రంగా కొట్టి హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore