కౌన్సిలర్లంటే పిఠాపురం కమిషనర్‌కు కనీసం విలువ లేదని వైసీపీ కౌన్సిల్ సభ్యులు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ నిధుల నుండి ఆమోదం తెలిపి, టెండర్లు పిలిచిన పనులను కమిషనర్ నామా కనకారావు అర్థాంతరంగా నిలుపుదల చేసారని ఆరోపించారు. అత్యవసర కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ తీరుపై నిరసన తెలిపారు. గతంలో కౌన్సిల్ ఆమోదించిన పనులను కూడా అజెండాకు తీసుకు రాకుండా కమిషనర్ సొంత పెత్తనం చేస్తున్నారన్నారు. దీనిపై స్పందించిన కమిషనర్ ప్రభుత్వం నిబంధనల మేరకు మాత్రమే తాను పనిచేస్తానని, ఇందులో ఎవరినీ కించపరచడం తన ఉద్ధేశ్యం కాదన్నారు. కౌన్సిల్ సభ్యులు చెబుతున్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.









