కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు సోమవారం స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వం అందించిన ప్రింటర్స్ ను ఎంపీడీవో జె శ్రీనివాస్,డిప్యూటీ ఎంపీడీవో సలాది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ,వార్డు సచివాలయాల్లో కంప్యూటర్ల తో పాటు ప్రింటర్స్ కూడా అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సచివాలయ అధికారి శ్రీనివాసరావు,యండమూరి గ్రామ సర్పంచ్ మారెళ్ళ శివ సిబ్బంది పాల్గొన్నారు.








