కాకినాడ జిల్లా అతి ప్రాచీనమైన ఉప్పాడ-కొత్తపల్లి మండలంలోని బషీర్‌బీబీ ఔలియా ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. ఆఖరి రోజు బషీర్‌బీబీ(బంగారు పాప)దర్గా వద్ద పంపిణీచేసే పవిత్రమైన గంధం కోసం భక్తులు క్యూకట్టారు. ప్లాస్టిక్ బాటిల్స్, చిన్న డబ్బాలు , గ్లాసులు వంటివి తీసుకొచ్చి పవిత్ర గంధాన్ని పట్టుకెళ్లారు. ఈ గంధం పూసుకోవడం ద్వారా చెడు ప్రభావం తొలగి మంచి జరుగుతుందనేది భక్తుల నమ్మకం. బిందెల కొద్ది గంధాన్ని పంపిణీ చేశారు.









