కర్ణాటకలో కోలార్ జిల్లా శ్రీనివాసపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీ పనులనిమిత్తం అన్నమయ్య జిల్లా నుండి కోలార్ జీపులో వెళ్తుండగా శ్రీనివాసపురం వద్ద అదుపుతప్పి జీపు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. 15 మంది వరకు గాయాలయ్యాయి. వెంకటమ్మ (60), శ్రీనివాసులు (25), మున్నప్ప (65) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.మృతులది అన్నమయ్య జిల్లా పూలకుంట వారి పాలెం గా చెబుతున్నారు.









