కాకినాడ జిల్లా పిఠాపురం ఆర్ ఆర్ బి హెచ్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం రాష్ట్రస్థాయి ఓపెన్ తైక్వాండో బాల బాలికల పోటీలు జరిగాయి.ఈ పోటీలకు రాష్ట్ర నల్లమూలల నుండి 250 మంది బాలబాలికలు పాల్గొన్నారు.పోటీలను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రారంభించి అనంతరం బహుమతి ప్రధానం చేశారు.ఈ పోటీలలో పిఠాపురం తైక్వాండో క్రీడాకారులు మొదటి స్థానం సాధించగా,రెండో స్థానంలో అమలాపురం,మూడో స్థానంలో కడప,నాలుగో స్థానంలో విజయనగరం తైక్వాండో క్రీడాకారులు నిలిచారని పోటీలు నిర్వహణ కార్యదర్శి పి లక్ష్మణరావు తెలిపారు.న్యాయ నిర్ణయితలగా జి.శివప్రసాద్. పి కృష్ణ. పి పవన్. సతీష్ వ్యవహరించారు









