అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించవలసిన అంబులెన్స్ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అవి మోరయించి రోగులకు తిప్పలు తప్పడం లేదని సామర్లకోటలోని ప్రజలు వాపోతున్నారు.శనివారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఒక రోగిని అత్యవసరంగా కాకినాడ ఆసుపత్రికి తరలించవలసి ఉండగా అంబులెన్సు మొరయించింది.రోగి బంధువులు స్థానికుల సహాయంతో అంబులెన్సు నెడితే ఎట్టకేలకు స్టార్ట్ అవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సామర్లకోటలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే అంబులెన్స్ పరిస్థితి తరచూ ఇదే విధంగా ఉంటుందని స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సేవలు వాహనం ఇలా ఉంటే రోగులకు రక్షణ ఎలా లభిస్తుందని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా సక్రమ నిర్వహణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు









