పట్టణంలో ఎంతోమందికి సుపరిచితులైన తబిత హై స్కూల్ విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ శ్యామ్ జె వేదాల శనివారం అకాల మృతి చెందారు. సుమారు 40 సంవత్సరములు పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఎంతోమంది విద్యార్థి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో విశేష కృషి చేశారు.విద్యార్థులకు విద్యను అందించడంతోపాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. పిఠాపురం పట్టణంలో తొలిసారిగా వృద్ధాశ్రమాన్ని నడిపింది శ్యామ్ మాస్టారు ఆధ్వర్యంలోనే.ఆయన వద్ద విద్యను అభ్యసించిన విద్యార్థులు ఎంతోమంది వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు.జీవా పిఠాపురం, క్యాప్ – సి వ్యవస్థాపకుల్లో ఒకరుగా, పిఠాపురం గిడియన్ క్యాంప్ కోచ్,పూర్వపు రాష్ట్ర గిడియన్ చాప్లిన్ ఎన్నో సేవ కార్యక్రమాల్లో ఆయన ముందుండేవారు.ఆయన అకాల మృతి పై ఆయన వద్ద విద్యనభ్యసించిన శిష్యులు,పలువురు క్రైస్తవ సంఘం పెద్దలు,పట్టణ ప్రముఖులు, కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు,సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.









