జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ,ద్వితీయ సంవత్సర విద్యార్థుల ప్రయోగ పరీక్షలు రెండవ రోజు ఎలాంటి అవాంతరాలు లేకుండాప్రశాంతంగా కొనసాగాయి.ఉదయం జనరల్,ఒకేషనల్ విభాగాలకు చెందిన 58 పరీక్షా కేంద్రాలలో మొత్తం 2918 మంది విద్యార్థులు నమోదు కాగా,2800 మంది హాజరయ్యారు.మధ్యాహ్నం 2368 మంది విద్యార్థులకు 2321 మంది హాజరైయ్యారు.బోర్డు అబ్సర్వర్ గా జి నరసింహారావు, జాయింట్ సెక్రటరీ, విచ్చేసి జిల్లాలో పలు పరీక్ష కేంద్రాలను సందర్శించారు.పరీక్షల నిర్వహణలో పారదర్శకత, క్రమశిక్షణను నిర్ధారించేందుకు అన్ని కేంద్రాలలో సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లు నియమించబడినట్లు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వి. కేశవరావు, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు పలు కేంద్రాలను పరిశీలించారు.









