పిఠాపురం పట్టణంలో స్థానిక ఉప్పాడ బస్టాండ్ జంక్షన్లో శనివారం విద్యుత్ స్తంభంపై అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి..పక్షులు ఏర్పాటు చేసుకున్న గూడు విద్యుత్ తీగల రాపిడికి మండి మంటలు ఏర్పడినట్లు అగ్నిమాపక అధికారి రామకృష్ణ దృవీకరించారు.స్థానికుల సమాచారంతో మంటలను సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసినట్లు తెలిపారు.ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని..రూ 15 వేలు విలువైన బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ సేవలందించే వైర్లు మంటల్లో దగ్ధమైయ్యాయి.









