ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ అన్నారు.సిఐటియు కరప మండల సమావేశం కార్యదర్శి పి వీరవేణి అధ్యక్షతన జరిగింది.దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యిన వెంకటరమణ మాట్లాడుతూ కార్మికులు నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని సమ్మె చేస్తున్నారని ఈ సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలన్నారు. లేబర్ కోడ్స్ అమలులోకి వస్తే కార్మికులు బానిస వ్యవస్థలోకి నెట్టబడతారన్నారు. ఉన్న కొద్దిపాటి హక్కులు కూడా అమలు కాని పరిస్థితులు ఏర్పడతాయ న్నారు.పని గంటల పెంచిన రాష్ట్ర కూటమి ప్రభుత్వం వేతనాలు మాత్రం పెంచడం లేదన్నారు.ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్ రమణి,ఆర్ వెంకటలక్ష్మి,సంజయ్, వరలక్ష్మి,రాంప్రసాద్,వీర్రాజు,శ్రీదేవి,రాజి తదితరులు పాల్గొన్నారు.









