వందేమాతరం గీతం 150 సంవత్సరాల వేడుకలు పురస్కరించి యువతలో జాతీయతా భావనను పెంపొందించేందుకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సిక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో తూర్పు తీరం వెంబడి 65మంది సైకిలిస్టులతో వందేమాతరం కోస్టల్ సైక్లథాన్ ర్యాలీ నిర్వహిస్తోంది.గత నెల 28వ తేదీన పశ్చిమబెంగాల్ లోని భక్కాలి బీచ్ మొదలైన ర్యాలీ ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్,తమిళనాడు రాష్ట్రాల గుండా సాగి ఈ నెల 22వ తేదీన కేరళ లోని కొచ్చి చేరుకుంటుంది.ఇందులో భాగంగా ఈ సైక్లథాన్ ర్యాలీ శనివారం సాయంత్రం ఉప్పాడ చేరుకుంటుంది.ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ హాజరై ర్యాలీ కి స్వాగతం పలకనున్నారు.









