దేశవ్యాప్తంగా క్యాబ్,ఆటో,బైక్ ట్యాక్సీ సేవలకు అంతరాయం ఏర్పడే అవకా శముంది.కనీసఛార్జీలు,డ్రైవర్ల సౌకర్యాలు,వంటి డిమాండ్లతో ఓలా,ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు ఫిబ్రవరి7న దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు.
తెలంగాణ గిగ్అండ్ప్లాట్ఫామ్ వర్కర్ల యూనియన్‌తో పాటు పలుకార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ సమ్మె నిర్వహించనున్నారు.కనీసం6గం పాటు డ్రైవర్లు సేవలను నిలిపివేసి నిరసన వ్యక్తం చేస్తారని సంఘాల ప్రతినిధులు తెలిపారు.









