భవన నిర్మాణ కార్మికులకు గతంలో అందించిన సంక్షేమ పథకాలను పునరుద్దరించాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు.కార్మిక శాఖ సమీక్ష సమావేశంలో ప్రసూతికి రూ20వేలు, వివాహానికి రూ40వేలు,సహజ మరణానికి రూ.60వేలు,అంత్యక్రియలకు రూ.20వేలు ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.









