పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఈనెల 5 న(గురువారం) అన్ని వార్డుల్లో కొళాయిలు బంద్ కానున్నాయి. పాదగయ జంక్షన్ వద్ద మెయిన్ పైపులైన్ మరామత్తుల్లో భాగంగా గురువారం సాయంత్రం తాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కనకారావు తెలిపారు. శుక్రవారం ఉదయం నుండి యధావిధిగా తాగునీటి సరఫరా జరుగుతుందన్నారు.









