క్యాన్సర్ పై విజయం స్కినింగ్ తో సాధ్యం అని స్థానిక ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు.మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయరాం మాట్లాడుతూ ముందస్తు పరీక్షల ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నివారించవ చ్చన్నారు.18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ నోటి,రొమ్ము ,గర్భా శయ ముఖ ద్వార క్యాన్సర్ పరీక్షలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా చేయబడు తున్నాయన్నారు.ఇంటి వద్దకు వచ్చే ఆరోగ్య సిబ్బందికి ప్రజలు సహకరించి పరీక్షలు చేయించుకోవాలని కోరారు.ఈ ర్యాలీలో ఆరోగ్య సిబ్బంది,ఆశాలు, ఏఎన్‌ఎంలు,తఃదితరులు పాల్గున్నారు.









