నారా లోకేష్ ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. విద్య, ఐటీ కి సంబంధించి పలు ప్రతిపాదనలు కేంద్రం మంత్రుల వద్ద ఉంచనున్నారు. రాష్ట్రానికి కావాల్సిన నిధులు, బడ్జెట్ అమలు తదితర అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న లోకేష్ ముందుగా టిడిపి ఎంపీలతో ప్రత్యేకంగా పలు అంశాలపై చర్చించారు.










