కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ ఏసిబి కేసు వెంటాడుతూనే ఉంది. గత ఐదేళ్ల క్రితం పిఠాపురం మున్సిపాలిటీలో జరిగిన అవకతవకలకు సంబంధించి అప్పట్లో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో తాజాగా విచారణ అధికారిగా విశాఖపట్టణం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పిఠాపురం మున్సిపాలిటీ రెవెన్యూ విభాగంలో జరిగిన అవకతవకలకు సంబంధించి అప్పట్లో పనిచేసిన కమిషనర్ రామ్మోహన్, రెవెన్యూ అధికారి రూబెన్, ఆర్ ఐ వరప్రసాద్, బిల్ కలెక్టర్ నూకరాజు పై విచారణకు ఏసీబీ ఆదేశించింది. కాగా కమిషనర్ ఉద్యోగ విరమణ చేయగా, ఆర్.ఐ మృతి చెందడంతో మిగిలినవారు వివిధ మున్సిపాలిటీలలో పనిచేస్తున్నారు.









