కాకినాడ జిల్లాలోని కత్తిపూడి వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీ పనికి వెళుతున్న ఆటో-ఇసుక లారీ ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. జి.కొత్తపల్లి మండలం శ్రీరాంపురం, తొండంగి మండలం బుచ్చయ్యపేట, ఆవుల మందకు చెందిన కూలీలు ధర్మవరంలో సర్వీస్ తోట పనికి వెళుతుండగా ఈప్రమాదం జరిగింది. ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.









